ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ ప్రధాని విషెస్
ఇరాన్ నూతన సంవత్సరం 'నౌరూజ్' సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆ దేశ ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం ద్వారా ఆయన స్పందిస్తూ, ఇరానీయులను 'ధైర్యవంతులైన ప్రజలు' అని కొనియాడారు. ఇరు దేశాల మధ్య స్నేహం మళ్లీ చిగురిస్తుందని, త్వరలోనే స్వేచ్ఛతో కూడిన నూతన ప్రారంభం లభిస్తుందని నెతన్యాహు ఆకాంక్షించారు.