'మిత్ర దేశాలను మోదీ శత్రువులుగా మార్చారు'
మోదీ ప్రభుత్వం మిత్ర దేశాలను శత్రువులుగా మార్చిందని TNCC అధ్యక్షుడు సెల్వపెరుంతగై ఆరోపించారు. మోదీ సర్కార్ చర్య వల్లే దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ముడి చమురు కొరత కారణంగా సిలిండర్ ధరను రూ.5 పెంచితే బీజేపీ ఆందోళన చేసిందని గుర్తు చేశారు. భారత్ ఎవరి నుంచి చమురు కొనాలో కూడా US నిర్ణయిస్తోందని.. ఈ పరిస్థితి మారాలంటే రాహల్ ప్రధాని కావాలని తెలిపారు.