నానో యూరియాతో పర్యావరణానికి ప్రయోజనం

SRD: నానో యూరియా వాడడం వల్ల పర్యావరణానికి ప్రయోజనకరంగా ఉంటుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ అన్నారు. చౌటకూర్‌లో నానో యూరియాపై అవగాహన సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇఫ్కో సంస్థ నానో యూరియాను తయారుచేసి రైతులకు అందుబాటులో ఉంచుతుందని పేర్కొన్నారు. దీనివల్ల పంటల దిగుబడి పెరుగుతుందని తెలిపారు.