చికిత్సపొందుతూ వృద్ధుడి మృతి
మన్యం జిల్లా సీతానగరం మండలం మరిపివలస వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధుడు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. రోడ్డు పక్కన నిలుచున్న సమయంలో ద్విచక్రవాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా ప్రాణాలు దక్కలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.