కానిస్టేబుల్ కారు ఢీ.. ఎస్సై, ఆయన కూతురికి గాయాలు

KRNL: నగరంలోని డోన్ రోడ్డులో ఉన్న మిస్టర్ ఇడ్లీ సర్కిల్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో CID SI శ్రీనివాసులు, ఆయన కూతురికి గాయాలయ్యాయి. కుటుంబంతో నడుచుకుంటూ వెళ్తుండగా, దొర్నిపాడు పీఎస్‌కు చెందిన కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ డ్రైవ్ చేస్తున్న కారు ఢీ కొట్టింది. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అర్బన్ తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు.