VIDEO: నిత్య జనగణమనకు ఎనిమిదేళ్లు

KNR: జమ్మికుంటలో 15 ఆగస్టు 2017లో చేపట్టిన నిత్య జనగణమనకు రేపటితో ఎనిమిదేళ్లు ఏళ్లు పూర్తికానుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిత్య జనగణమనకు అప్పటి జమ్మికుంట సీఐ ప్రశాంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. నేటికీ ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు జనగణమన అధినాయక అంటూ వీధులన్నీ దేశభక్తి చాటుకుంటాయి.