లక్ష రూపాయల విలువ చేసే కలప స్వాధీనం
ASF: కవ్వాల టైగర్ రిజర్వ్ ఇందన్పల్లి రేంజ్ పరిధిలోని లోతొర్రె గ్రామంలో శుక్రవారం రాత్రి ఇందన్పల్లి, జన్నారం రేంజ్ సిబ్బంది సంయుక్త దాడి నిర్వహించి 24 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు లక్ష రూపాయలు అని ఎఫ్ఆర్‌దో లక్ష్మీనారాయణ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అనధికార టేకు వాడకూడదని, బదులుగా UPVC, WPC తలుపులు వాడాలని సూచించారు.