రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ఎస్సై
BHPL: పలిమెల మండలం పంకెన గ్రామంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకలు రహదారి భద్రతపై అవగాహనకు వేదికయ్యాయి. 'అరైవ్ అలైవ్' కార్యక్రమంలో భాగంగా పలిమెల ఎస్సై జె.రమేష్ ఈ వేడుకల్లో పాల్గొని ప్రజలకు దిశానిర్దేశం చేశారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో రోడ్డు భద్రత నియమాలపై ప్రతిజ్ఞ చేయించారు.