స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు

JGL: మెట్‌పల్లిలో బుధవారం స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. దేవతల వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ ద్వారకా, స్వర్గలోకం వంటి అద్భుత నిర్మాణాలు సృష్టించారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.