తమలపాకుల అలంకరణలో రేణుక ఎల్లమ్మ దర్శనం

తమలపాకుల అలంకరణలో రేణుక ఎల్లమ్మ దర్శనం

NLG: కనగల్ మండలం ధర్వేశిపురంలో శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారు గురువారం తమలపాకులతో ప్రత్యేకంగా అలంకరించబడి భక్తులకు దర్శనమిచ్చారు. పూజారి మల్లాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ విశేష పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అమ్మవారి దివ్యరూపాన్ని చూసి భక్తులు పులకించిపోయారు.