'రావు బహదూర్' టీజర్ వచ్చేసింది

'రావు బహదూర్' టీజర్ వచ్చేసింది

ప్రముఖ నటుడు సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా తెరకెక్కిస్తోన్న సినిమా 'రావు బహదూర్'. తాజాగా ఈ మూవీ టీజర్‌ను దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. 'నాకు అనుమానం అనే భూతం పట్టింది' అంటూ ఆసక్తికరమైన డైలాగ్‌తో ప్రారంభమైన ఈ వీడియో ఆకట్టుకుంటోంది. ఇక GMB ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సైకలాజికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా 2026 వేసవిలో రిలీజ్ కానుంది.