'దళితులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి'
VZM: ముంజేరు సిద్ధార్థ ఎస్సీ కాలనీ దళితులపై దాడిచేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని అంబేద్కర్ రైట్స్ ఫోరమ్ ఉత్తరాంధ్ర అధ్యక్షుడు పాండ్రింకి వెంకటరమణ డిమాండ్ చేశారు. సిద్దార్థ ఎస్సీకాలనీ వాసులపై దాడిని నిరసిస్తూ భోగాపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న రిలే దీక్షలు ఆదివారం కూడా కొనసాగింది. దళితులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.