VIDEO: ఆలయాల్లో కార్తీక పౌర్ణమి సందడి
TPT: నాయుడుపేట బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా స్థానిక దేవాలయాల్లో భారీ సందడి నెలకొంది. ఈ మేరకు వివిధ ఆలయాలను భక్తులు సందర్శించారు. పట్టణంలోని స్వర్ణముఖి నది తీరాన వెలసిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలను వెలిగించి శుభాకాంక్షలు తెలిపారు.