VIDEO: బస్సులు లేక ప్రయాణికుల ఇబ్బందులు

GNTR: ప్రత్తిపాడు మండల పరిధిలోని ఏపీ పాలెం వద్ద శుక్రవారం సాయంత్రం గుంటూరు-పర్చూరు రహదారిలో ఆర్టీసీ బస్సు బ్రేక్ డౌన్ అయ్యి నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు గంటల తరబడి ఇబ్బందులకు గురయ్యారు. మరో బస్సు కోసం ప్రయాణికులు గంటలు తరబడి ఎదురుచూసిన ఫలితం లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి గమ్యాలకు చేరారు.