44కి చేరిన మృతుల సంఖ్య
హాంకాంగ్‌లోని ఓ నివాస సముదాయంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 44కి చేరింది. 279 మంది కనిపించకుండా పోయారు. 2000 ఇళ్లు ఉన్న ఈ నివాస సముదాయంలో 4800 మంది ప్రజలు నివసిస్తున్నారు. భారీ స్థాయిలో ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు 128 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది కృషి చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.