ప్రజావాణికి 265 దరఖాస్తులు స్వీకరణ

KNR: కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 265 మంది అర్జీదారులు దరఖాస్తులు సమర్పించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను ఆ సంబంధిత అధికారులకు బదిలీ చేస్తూ దరఖాస్తులను వెనువెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.