మాన్ సింగ్‌కు నివాళి అర్పించిన ఎమ్మెల్యే
BDK: టేకులపల్లి మండలం హనుమతండా గ్రామంలో తండా నాయకుడు భూక్యా మాన్ సింగ్ సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. కాగా విషయం తెలుసుకున్న ఇల్లందు MLA కోరం కనకయ్య మాన్ సింగ్ భౌతికాయానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ - ఉమా, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుభాష్ చంద్ర బోస్, సుధీప్ పాల్గొన్నారు.