ఇళ్ల ముందు నిలిపిన బైక్ వారి టార్గెట్..!

ఇళ్ల ముందు నిలిపిన బైక్ వారి టార్గెట్..!

MBNR: ఉమ్మడి మహబుబ్‌నగర్‌లో ఇళ్ల ముందు నిలిపిన పలు బైకులను రాత్రిళ్లు చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గద్వాల SI కళ్యాణ్ తెలిపిన వివరాలు.. వంశీ, మరో ఏడుగురు కలిసి బైకులను చోరీ చేసేవారు. గతంలో ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 35 బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వంశీని శుక్రవారం ధరూర్‌మెట్‌లో అదుపులోకి తీసుకున్నారు.