ఇరాన్ దాడులు.. ఖతార్ కీలక నిర్ణయం
ఇరాన్ దాడుల నేపథ్యంలో ఖతార్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ దేశాలకు ఖతార్ నుంచే 20 శాతం గ్యాస్ సరఫరా అవుతోంది. అలాగే క్రూడాయిల్ ఉత్పత్తిని కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో పలు దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.