BREAKING: భారత్ చేరుకున్న చమురు నౌక
హర్మూజ్ జలసంధి నుంచి భారత నౌకలు వెళ్లేందుకు అనుమతిస్తామని ఇరాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే 'శివాలిక్' భారత్ చేరుకుంది. తాజాగా 'నందాదేవి' కూడా 45 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్‌ను తీసుకుని గుజరాత్‌లోని జామ్‌నగర్ పోర్టుకు చేరుకుంది. దీంతో దేశంలో గ్యాస్ సరఫరాపై ఆందోళన నెలకొన్న వేళ ఈ నౌక రాక ఊరటనిస్తోంది.