'స్థానిక ఎమ్మెల్యే గారు జారా స్పందించండి'
MHBD: నర్సింహులపేట మండలం జయపురం గ్రామంలో స్మశానవాటికకు వెళ్లే రోడ్డు లోతైన గుంతలు, బురదతో నిండి పూర్తిగా ధ్వంసమైంది. దీంతో మృతదేహాలను పంట పొలాల గుండా మోసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దారి బాగులేక రోడ్డు పక్కనే దహన సంస్కారాలు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరారు.