రెచ్చిపోయిన దొంగలు.. ఒకేరోజు రెండు బైకులు చోరి

రెచ్చిపోయిన దొంగలు.. ఒకేరోజు రెండు బైకులు చోరి

JN: జనగామ మున్సిపాలిటీ కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. ఒకే రోజు రెండు బైకులు చోరీ చేసి పోలీసులకు సవాల్ విసిరారు. మున్సిపాలిటీ పరిధిలోని ధర్మకంచ కాలనీకి చెందిన జలిగమ మహేష్ ఇంటి ముందున్న పల్సర్ బైక్, బండి శేఖర్ బుల్లెట్ బైక్ దొంగిలించబడ్డాయి. బాధితులు జనగామ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.