VIDEO: బైక్ దొంగల ముఠా అరెస్ట్.. 14 వాహనాలు స్వాధీనం

VIDEO: బైక్ దొంగల ముఠా అరెస్ట్.. 14 వాహనాలు స్వాధీనం

HNK: ఎల్కతుర్తి మండల కేంద్రంలో ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు సీఐ పులి రమేష్ తెలిపారు. శుక్రవారం అరెస్ట్ అయిన వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి మొత్తం 14 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.