ఆదోనిలో రూ.4,44,288ల విలువైన చెక్కుల పంపిణీ

KRNL: ఆదోనిలో TDP ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు 10 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు. రూ.4,44,288 విలువైన చెక్కులను వారికి పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే ఉన్నప్పటికీ నిరుపేదలకు వైద్య ఖర్చుల కోసం సీఎం చంద్రబాబు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలిపారు.