VIDEO: మున్సిపాలిటీ నామినేషన్ కేంద్రం పరిశీలించిన ఆర్డీవో
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని బుధవారం వరంగల్ రూరల్ ఆర్డీవో సుమ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియను ఆమె పరిశీలించి, ఎన్నికల నిర్వహణలో పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులకు సూచించారు. అభ్యర్థులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు.