ఆలయంలో కార్తీక దీపాల మహోత్సవం
NGKL: అచ్చంపేట మండలంలోని ఉమామహేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో సోమవారం రాత్రి కార్తీక దీప మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ సతీమణి, మాజీ జడ్పీటీసీ డాక్టర్ అనురాధ, కూతురు యుక్తాముఖితో కలిసి హాజరయ్యారు. వారు దేవాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి, ఆకాశ దీపం, కార్తీక దీపాలు వెలిగించారు.