బైక్ రైడ్ బుక్ చేస్తూ.. కొత్త తరహాలో మోసం..!
HYD: ఓ వ్యక్తి బైక్ రైడర్లను తప్పుదోవ పట్టించి మోసం చేస్తున్న ఘటన ఉప్పల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. సుమంత్ అనే ఓ వ్యక్తి GENPACT ఉద్యోగిగా తన ఐడి కార్డు చూపిస్తూ బైక్ రైడ్లను బుక్ చేసి, తనకు ఏదో అత్యవసర పరిస్థితి ఉందని చెబుతాడు. తనతో క్యాష్ ఉందని, QR పేమెంట్ పంపిస్తే, రైడ్ స్టార్ట్ చేసే సమయంలో మళ్లీ మీకు ఇస్తానని, డబ్బు పంపితే రైడ్ క్యాన్సల్ చేస్తాడు.