మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ దుర్మార్గపు చర్య
PPM: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ప్రభుత్వం దుర్మార్గపు చర్య అని ఎమ్మెల్సీ విక్రాంత్ అన్నారు. నియోజకవర్గంలో వైసీపీ చేపట్టిన సంతకాల కాపీలను ప్రదర్శిస్తూ పాలకొండ పట్టణం లోఎమ్మెల్సీ నివాసం వద్ద మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. ఈ సంతకాల కాఫీలను జిల్లా కేంద్రానికి అక్కడ నుంచి విజయవాడ తరలిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే కళావతి, వైస్ఎంపీపీ సూర్యప్రకాశ్, పాల్గొన్నారు.