ఇళ్లు దగ్ధమైన కుటుంబానికి అండగా నిలబడిన పోలీస్..!

ఇళ్లు దగ్ధమైన కుటుంబానికి అండగా నిలబడిన పోలీస్..!

KRNL: గోనెగండ్ల మండలం వేముగోడులో ఇళ్లు దగ్ధమై కట్టుబట్టలతో మిగిలిన వడ్డే నాగరాజు కుటుంబానికి స్థానిక పోలీస్ మహబూబ్ బాషా అండగా నిలిచారు. ఇవాళ మహబూబ్ బాషా రూ. 20,000 ఆర్థిక సాయంతో పాటు, రెండు బియ్యం బస్తాలను అందజేశారు. మానవత్వంతో స్పందించి సహాయం చేసిన మహబూబ్ బాషాను గ్రామస్తులు అభినందించారు.