హార్బర్ ఏసీపీగా వివేకానంద బాధ్యతలు
విశాఖ హార్బర్ సబ్‌డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా సి.హెచ్. వివేకానంద బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 1991 బ్యాచ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా సేవలు ప్రారంభించిన ఆయన, వివిధ హోదాల్లో పనిచేసి విశేష అనుభవం సంపాదించారు. హార్బర్ ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై దృష్టి సారిస్తానని తెలిపారు.