మూసీ ప్రాజెక్ట్‌‌కు మేము వ్యతిరేకం కాదు: బీజేపీ

మూసీ ప్రాజెక్ట్‌‌కు మేము వ్యతిరేకం కాదు: బీజేపీ

HYD: మూసీ ప్రాజెక్ట్‌పై BJP రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మూసీ ప్రాజెక్ట్‌కు BJP వ్యతిరేకంగా లేదు. కానీ, పేదల ఇళ్లు కూల్చడాన్ని మాత్రం వ్యతిరేకిస్తాం. మూసీ పునరుజ్జీవనానికి మా పార్టీ ఎప్పుడూ మద్దతు తెలుపుతుంది. HYD నుంచి కృష్ణా నదిలో కలిసే వరకు మూసీ శుభ్రంగా ఉండాలని, రైతులకు సాగునీటిగా ఉపయోగపడాలని కోరుకుంటున్నాం' అని పేర్కొన్నారు.