'దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి'
ప్రకాశం: బండ్లమూడి గ్రామ దళితులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని దళిత సేన నాయకులు డిమాండ్ చేశారు. అయితే ఇవాళ దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం దళిత సేన నాయకులు గర్నెపూడి ప్రేమ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారుతున్నా కానీ దళితులపై దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు. వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.