మానవత్వం చాటుకున్న ఎస్సై
ప్రకాశం: దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులో కళ్యాణ్ మండపం వద్ద రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి, అంబులెన్స్ కోసం నిరీక్షిస్తూ రోడ్డుపై పడి ఉన్నారు. అదే సమయంలో ఆ దారిలో వెళ్తున్న దర్శి ఎస్ఐSI మురళీ క్షతగాత్రులను గమనించి తక్షణమే స్పందించారు. స్థానికుల సహాయంతో వారిని తన కారులో ఎక్కించుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.