ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలపై విజిలెన్స్

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలపై విజిలెన్స్

SRPT: అనంతగిరి మండలం ఖానాపురంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని విజిలెన్స్ అధికారులు ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విజిలెన్స్ ఇన్‌ఛార్జి అధికారి బూడిగం అంజయ్య పర్యవేక్షణలో అధికారులు రికార్డులు, ధాన్యం కొనుగోలు వివరాలు, టోకెన్లు, రశీదులు, తూకం పత్రాలు, నిల్వ రికార్డులను పరిశీలించారు.