ఆళ్లగడ్డలో పర్యటించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
NDL: ఆళ్లగడ్డ పట్టణంలో ఇవాళ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పర్యటించారు. పట్టణంలో ఉన్న 50 మంది శిల్పకళాకారులకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ టూల్ కిట్లను పంపిణీ చేశారు. ఒకప్పుడు ఆళ్లగడ్డ అంటే ప్రజలు భయపడేవారు అని ఇప్పుడు ఆళ్లగడ్డ అంటే శిల్పాలకు పెట్టింది పేరు అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. శిల్పకళాకారులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే అన్నారు.