ఘనంగా సీపీ బ్రౌన్ జయంతి వేడుకలు
SKLM: హిరమండలంలో స్థానిక ఎంపీడీవో ఆఫీస్‌లో ఆంగ్లేయుడు సీ.పి. బ్రౌన్ జయంతి వేడుకలను ఎంపీడీవో కాళీ ప్రసాదరావు ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలుగు సాహిత్యానికి విశేష సేవలు అందించిన సీ.పి.బ్రౌన్‌కు అధికారులు నివాళులు అర్పించారు. తహసీల్దార్, డిప్యూటీ ఎంపీడీవో, మండల స్థాయి అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.