కోచ్ పదవి.. జైషాకు ధన్యవాదాలు: గంభీర్
IPL 2024 సమయంలో జై షా(అప్పటి BCCI సెక్రటరీ) తనకు ఫోన్ చేసి హెడ్ కోచ్ పదవి ఆఫర్ చేసినట్లు గంభీర్ తెలిపాడు. అప్పటికి తనకు అనుభవమే లేదని, మెంటార్‌గానే చేశానని.. అలాంటి తనపై నమ్మకం ఉంచి కోచ్ బాధ్యతలు అప్పగించినందుకు జైషాకు ధన్యవాదాలు తెలియజేశారు. సౌతాఫ్రికా, న్యూజిలాండ్ చేతిలో సొంతగడ్డపై వైట్ వాష్ అయినప్పుడూ మద్దతుగా నిలిచారని, ఆ ఓటములను మర్చిపోలేనని గౌతీ పేర్కొన్నాడు.