VIDEO: వెంకటగిరిలో 72 వేల సంతకాలు సేకరణ
TPT: భవిష్యత్ తరాల కోసమే కోటి సంతకాలు సేకరించామని వైసీపీ వెంకటగిరి ఇంఛార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వెంకటగిరి నియోజకవర్గంలో 72వేల మంది ప్రజలు సంతకాలు చేశారని చెప్పారు. సంబంధిత పత్రాలను వెంకటగిరి నుంచి ర్యాలీగా నెల్లూరులోని వైసీపీ జిల్లా కార్యాలయానికి తరలించారు.