'నిందితులపై చర్యలు తీసుకోండి'

తిరుపతి: జిల్లా రూరల్ పరిధి తాటితోపు మహాత్మ జ్యోతిరావు ఫూలే రెసిడెన్షియల్ స్కూల్లో దాదాపు 230 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వాచ్‌మెన్ మద్యం తాగుతూ విధులకు హాజరవుతున్నట్లు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం నాయకుల ఆరోపించారు. ఈ మేరకు గురువారం ప్రిన్సిపల్‌కు వినతిపత్రం అందజేశారు. ఇటువంటి వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.