ఆలేరు నియోజ‌క‌వ‌ర్గ‌ అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే

ఆలేరు నియోజ‌క‌వ‌ర్గ‌ అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే

BHNG: ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న‌ట్లు ప్రభుత్వ విప్, ఆలేరు MLA బీర్ల ఐలయ్య తెలిపారు. సోమవారం రాజాపేట మండలంలోని గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయ‌న శంకుస్థాపన చేశారు. రాజాపేటలో బీసీ, కురుమ కమిటీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు రాజాపేట శివాలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.