ప్రపంచకప్ విజేతలకు భారీ నజరానా

ప్రపంచకప్ విజేతలకు భారీ నజరానా

మహిళల వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం శుభాకాంక్షలు తెలియజేసింది. భారత జట్టులోని మహారాష్ట్రకు చెందిన క్రీడాకారిణులు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్‌కు భారీ నజరానా ప్రకటించింది. వారిలో ఒక్కొక్కరికి రూ. 2.25 కోట్ల చొప్పున అందజేయనున్నట్లు తెలిపింది. ప్రపంచకప్‌లో వారి అద్భుత ప్రదర్శన మహారాష్ట్రకు గర్వకారణమని పేర్కొంది.