దెబ్బతిన్న నాళాలను పరిశీలించిన కలెక్టర్
WGL: ఇటీవల నగరంలో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పలు కాలనీలలోని నాళాలను వరంగల్ కలెక్టర్ సత్య శారద సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానికులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే నాళాలకు మరమత్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపరిమితి నివేదికను వారికి అందించాలన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు.