'మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి'

WGL: మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని, వాటికి బానిసలు కావద్దని నెక్కొండ సీఐ శ్రీనివాస్ సూచించారు. నర్సంపేట మండలం మగ్దుంపురంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. చెన్నారావుపేట ఎస్సై రాజేష్ రెడ్డి, కళాశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.