నేటి నుంచి నిరవధిక సమ్మె
KDP: ఎర్రగుంట్ల మండలంలోని ఆర్టీపీపీపీ మెయిన్ గేట్ వద్ద విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు మంగళవారం ఆందోళన చేపట్టారు. 2022 నాటి బకాయిలు వెంటనే చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయవాడలో యాజమాన్యంతో జరిగిన చర్చలు విఫలమవడంతో, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు బుధవారం సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు.