GREAT.. 'ఆర్ఎంసీ'లో జిల్లా వాసి సౌమ్య ప్రతిభ
BHPL: రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్ఎంసీ) ప్రవేశ పరీక్షలో జయకేతనం ఎగురవేసి భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం బౌసింగ్ పల్లికి చెందిన చిందం సౌమ్య సత్తా చాటారు. దక్షిణ భారతదేశం నుంచే ఈ ఘనత సాధించిన ఏకైక బాలికగా ఆమె రికార్డు సృష్టించారు. భవిష్యత్తులో ఆర్మీలో ఉన్నత అధికారిణిగా సేవలు అందించడమే తన లక్ష్యమని సౌమ్య పేర్కొన్నారు.