మణుగూరు: రీసైక్లింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొద్దని వినతి

ప్లాస్టిక్ సంచుల రీసైక్లింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం పనులు జరుగుతున్నాయని,ఫ్యాక్టరీ ఏర్పాటును నిలుపుదల చేయాలని మణుగూరు టౌన్ శివలింగాపురం గ్రామస్థులు అన్నారు. గురువారం తహశీల్దార్ అద్దంకి నరేష్,మున్సిపల్ కమిషనర్ ప్రసాద్కు ఫిర్యాదు చేశారు.విషతుల్యమైన ఫ్యాక్టరీ పెడితే చుట్టుపక్కల ఉన్న ప్రజలకు క్యాన్సర్,దురద చర్మ, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని తెలిపారు