'విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలి'
అన్నమయ్య: రాయచోటిలో మంగళవారం నుంచి రాయలసీమ జిల్లాల ఎంఈవోలు, డైట్ అధ్యాపకులకు రెండు రోజుల GFLN శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులలో చదవడం, గణిత నైపుణ్యాలను పెంచడమే ఈ శిక్షణ లక్ష్యమని డీఈవోలు తెలిపారు. మార్చి 2026 నాటికి లక్ష్యాలను చేరుకోవడానికి 75 రోజుల కార్యాచరణను పగడ్బందీగా అమలు చేయాలని సూచించారు.