'ఉద్యోగులు భద్రతపై అప్రమత్తంగా ఉండాలి'
PDPL: ఉద్యోగులు భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, RG 3 జీయం నరేంద్ర సుధాకర్ రావు అన్నారు. సింగరేణి సంస్థలో 56 వార్షిక భద్రతా పక్షోత్సవాల సందర్భంగా రామగుండం-3 ఏరియాలోని ఓసీపీ-2 ఉపరితల గనిలో భద్రతా తనిఖీ బృందం పర్యటించింది. ఉద్యోగులు భద్రతపై అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రమాదరహిత సంస్థగా సింగరేణిని తీర్చిదిద్దాలని అన్నారు.