చిరంజీవిపై ఆనంద్ మహేంద్రా ప్రశంసలు
గ్లోబల్ సమ్మిట్లో మెగాస్టార్ చిరంజీవిని కలుసుకోవడంపై మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. 'చిరంజీవి కేవలం ఒక సినిమా లెజెండ్ మాత్రమే కాదు. ఆయన వినయం, ఇతరుల నుంచి తెలుసుకోవాలనే ఆసక్తి ఆయన్ను మరింత ప్రత్యేకంగా చేశాయి. ఈ లక్షణాలే ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించడానికి పునాదిగా నిలుస్తాయి.. అని ఆయన జీవితం నిరూపిస్తుంది' అని ట్విట్ చేశారు.