పీజీ వైద్యవిద్యలో అదనంగా సీట్లు మంజూరు
AP: రాష్ట్రంలో పీజీ వైద్యవిద్యలో అదనంగా 36 సీట్లను జాతీయ వైద్య మండలి మంజూరు చేసింది. 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనపు సీట్లను కేటాయించింది. ఏలూరు వైద్య కళాశాలకు 12, రాజమండ్రి 4, మచిలీపట్నం 8, నంద్యాల 4, విజయనగరం కళాశాలకు 8 సీట్ల చొప్పున కేటాయించింది. ఈ వివరాలను మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.